నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల తిరుపతి కొండపై కగ 3 వారాలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవుల కారణంగా మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో తిరుమల వీధులన్ని కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని సామాన్య భక్తుల సర్వదర్శనం కొరకు క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 24 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు క్యూలైన్లలో భక్తులకు అవసరమైన వసతులను పర్యవేక్షిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



