Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో 'జైల్ భరో' విజయవంతం

అశ్వారావుపేటలో ‘జైల్ భరో’ విజయవంతం

- Advertisement -
  • క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ర్యాలీ, రాస్తారోకో
    నవతెలంగాణ – అశ్వారావుపేట
    కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఏఐకేఎస్ సంయుక్తంగా అశ్వారావుపేటలో నిర్వహించిన ‘జైల్ భరో’ కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం బస్టాండ్ సెంటర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనలో సుమారు 300 మందికి పైగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని భైఠాయించారు.

విదేశీ దిగుమతులు తగ్గించి రైతు హక్కులు కాపాడాలి
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు గోకినపల్లి ప్రభాకర్, కొక్కిరపాటి పుల్లయ్య, పిట్టల అర్జున్, చిరంజీవి, గన్నిన రామకృష్ణ, తుమ్మ రాంబాబు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో జీరో సుంకంతో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోకి భారీగా దిగుమతి చేయడం వల్ల భారతీయ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన డిమాండ్లు
విద్యుత్ సవరణ బిల్లు–2025ను రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైనదిగా పేర్కొంటూ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. కార్మికుల పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేసే నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కె. నరసింహరావు (సీఐటీయూ), వాసం బుచ్చిరాజు (సీపీఐ-ఎంఎల్ మాస్‌లైన్), సోడెం కన్నారావు, నార్లపాటి చిలకారావు (టీయూసీఐ), రాజకీయ, రైతు సంఘాల నాయకులు చెన్నంశెట్టి సత్యనారాయణ (కాంగ్రెస్ మండల అధ్యక్షుడు), బండారి శ్రీను, దర్ముల శ్రీరాములు, కంగాల వెంకటేష్ (ఏఐపీకేఎంఎస్), సీసం రాము, ముల్లగిరి గంగరాజు, గడ్డం సత్యనారాయణ, కారం సూరిబాబు (రైతు సంఘం) పాల్గొన్నారు.

అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కూరం దుర్గ (నందిపాడు సర్పంచ్), బాడిస లక్ష్మణ్‌రావు (కావడిగుండ్ల), సోడెం చిన్న గంగమ్మ (కోయరంగాపురం), మడివి దుర్గారావు, వగ్గెల అర్జున్, కంగాల భూలక్ష్మి, కుంజ అర్జున్, కారం మల్లేష్, కంగాల వెంకటేష్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -