- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు సమస్యలను పరిష్కరించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె కారణంగా బ్యాంకులు బంద్ కానున్న నేపథ్యంలో ఖాతాదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులు సూచించాయి.
- Advertisement -



