- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీ మిలిటెంట్స్ డ్రోన్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేసినట్లు ప్రకటించారు. ఈ దాడిలో అరామ్కో ఆయిల్ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే, సౌదీ అధికారులు మిస్సైళ్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో, మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీకి సైనిక మద్దతు ఇచ్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ తెలిపారు.
- Advertisement -



