- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీనిని పార్టీ ఫిరాయింపుగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం వేటు వేస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -



