Monday, August 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాలో టైఫూన్‌ డాల్ఫిన్‌ బీభత్సం

చైనాలో టైఫూన్‌ డాల్ఫిన్‌ బీభత్సం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: చైనాలో టైఫూన్‌ డాల్ఫిన్‌ తుపాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. డాల్ఫిన్ గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లుగా ఆ దేశ అధికారులు పేర్కొన్నారు.ఈ తుపాన్‌ దాటికి  దేశ ఆర్థిక రాజధాని షాంఘైతో సహా తూర్పు చైనాలోని వివిధ ప్రాంతాల నుండి పది లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం షాంఘైలో దాదాపు 1,000 విమానాలు రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.

న్జౌలోని అధికారులు సుమారు 9 లక్షల మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, దాదాపు 1,000 అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. తైజౌ నగరంలో 3,90,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ఫుజియాన్ తీరప్రాంతంలో, సముద్ర అధికారులు డజన్ల కొద్దీ ప్రయాణీకుల ఫెర్రీ సర్వీసులను నిలిపివేసి, 100కు పైగా సముద్ర నిర్మాణ ప్రాజెక్టుల పనులను నిలిపివేశారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -