Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాలాపూర్‌ గణనాథుని దర్శించుకున్న విజయ్‌ దేవరకొండ

బాలాపూర్‌ గణనాథుని దర్శించుకున్న విజయ్‌ దేవరకొండ

- Advertisement -

నవరతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న వేళ, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుని దర్శించుకున్నారు. శనివారం రాత్రి ఆయన బాలాపూర్ మండపానికి విచ్చేసి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డితో కలిసి విజయ్ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేశ్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి, ఇతర సభ్యులు విజయ్ దేవరకొండను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంతో ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ లడ్డూను ప్రసాదంగా అందజేశారు. విజయ్ దేవరకొండ రాకతో మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -