Monday, August 10, 2026
E-PAPER
Homeఖమ్మం18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు

18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థులు

- Advertisement -

– ​గంగారం ఎస్డీవీఆర్ జెడ్పీ హైస్కూల్ 2007-08 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ దాసరి వీరారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2007- 2008 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత చిన్ననాటి మిత్రులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో ఆ పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందపరవశులయ్యారు. పాఠశాల రోజుల్లో తాము గడిపిన మధుర క్షణాలను, చేసిన అల్లరిని గుర్తుచేసుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పి తమ భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ, వారి పట్ల కృతజ్ఞతలు చాటుకున్నారు. రెండు దశాబ్దాల తర్వాత జరిగిన ఈ అపూర్వ కలయిక అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. పాత స్నేహాలను పునరుద్ధరించుకోవడమే కాకుండా, భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం టచ్‌లో ఉండాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -