Monday, August 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఅక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

- Advertisement -

స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి
వీబీజీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
నవతెలంగాణ-అచ్చంపేట
అక్రమ అరెస్టులతో ఉద్యమాలలో ఆపలేరని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశనాయక్ అన్నారు. సోమవారం దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కార్మికులు ప్రధాన రహదారిపై ర్యాలీ, అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజా పోరాటాలు చేస్తున్న నాయకులను అచ్చంపేట పోలీసులు అక్రమ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశా నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్ లు సంయుక్తంగా మాట్లాడుతూ..కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తుందన్నారు. ఎంతోమంది పోరాట త్యాగాలతో సాధించుకున్న దేశ స్వతంత్రాన్ని ఈ పాలకుల వల్ల విదేశీ సంస్థలకు తాకట్టుపెట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ పెట్టుబడిదారులకు, మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు భారతదేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. 

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, 29 పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ. 26,000/- ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వర్షాలు రాక, ఏసుకున్న పంటలకు గిట్టుబాటు ధర లేక, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉంటే.. స్మార్ట్ మీటర్ల పేరు తోటి మోటర్లకు మీటర్లు బిగించే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందనీ, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలికిందని మండిపడ్డారు. వెంటనే స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 

వీబీజీ రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దుచేసి, పాత పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని పేర్కొన్నారు. రైతాంగానికి రుణ విమోచన చట్టం చేయాలని, గిట్టుబాటు ధరతో పాటు పంట రుణాల సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం బీమా సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జైల్ భరో కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి రాములు,  రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, శ్రావణ్ కుమార్ , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు, సిఐటియు నాయకులు ఎస్. వెంకటయ్య , పర్వతాలు, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు పద్మ , లక్ష్మి , జ్యోతి రాధా,  అలివేల,  పద్మ,  గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలస్వామి , వెమయ్యా,  సుల్తాన్,  కొండయ్య, నిరంజన్ , ఈశ్వరయ్య , గణేష్,  శ్రీను,  తులసిరామ్ , ఇసాక్,  సిద్ధి,  రాజు,  మున్సిపల్ వర్కర్లు బాలమ్మ,  లక్ష్మణ్ , అలివేల, కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -