Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్..

ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్..

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారన్న వార్త తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని అండగా నిలవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మారణకాండలు పునరావృతం కాకుండా కేంద్రం కఠినమైన చర్యలు చేపట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img