Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలుఉగ్రవాదంపై పార్టీలకతీతంగా పోరాడుదాం

ఉగ్రవాదంపై పార్టీలకతీతంగా పోరాడుదాం

– పహల్గాం ముష్కర దాడి హేయమైనది : సీఎం రేవంత్‌రెడ్డి
– హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్టీలు, సిద్ధాంతాలకతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పీపుల్స్‌ ప్లాజా నుంచి నెక్లెస్‌ రోడ్‌ ఇందిరా విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దీనిలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, భారత్‌ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు, మంత్రులు డి శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం ఐక్యమవుదాం
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఏకమై పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భారత్‌లోకి చొచ్చుకొచ్చి.. పాక్‌ ఉగ్రవాదులు దాడి చేయటం హేయమైన చర్య అని అన్నారు. ”ఉగ్రవాదంపై పోరులో ప్రజలంతా ప్రధాని వెంట ఉంటారన్నారు. ఈ విషయంలో మోడీకి మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరముందని తెలిపారు. 1971లో పాకిస్తాన్‌్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు ఇందిరాగాంధీని వాజ్‌పేయి దుర్గామాతతో పోల్చారన్నారు. మరోసారి పాకిస్తాన్‌ను ఓడించాల్సిం దేనని చెప్పారు. పీవోకేను భారత్‌లో కలపాలన్నారు. ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకుని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న భారత్‌పై ఉగ్రదాడి జరిగిందనీ, అందరం ఏకమై దాన్ని అంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన వారికి కఠినంగా శిక్షించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img