- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం ఈ దృశ్యం కనిపించింది. వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమైన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన స్టెప్పులేసి సందడి చేశారు.