Tuesday, April 29, 2025
Homeజిల్లాలుఊర చెరువులో పడి వ్యక్తి మృతి

ఊర చెరువులో పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ  –  ఆర్మూర్

ఆలూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పుట్ట నవీన్ (41) ఊర చెరువులో మృతి చెందిన ఘటన సోమవారం  చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, నవీన్ గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం చెరువులో అతని శవం తేలింది. నవీన్ గత వారం రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన నవీన్ గతంలో దుబాయ్ వెళ్లి వచ్చినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img