Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు ఘన సన్మానం

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు ఘన సన్మానం

నవతెలంగాణ – తిరుమలగిరి సాగర్
తిరుమలగిరి సాగర్ మండల ప్రధాన కేంద్రం కు చెందిన సామాజిక, ప్రజా సేవకుడు,పగడాల సైదులు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన  శంకర్ నాయక్  ఆదివారం ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పగడాల సైదులు మాట్లాడుతూ శంకర్ నాయక్ ఎంపీపీగా జెడ్పిటిసిగా ప్రజలకు  సేవ చేశారన్నారు. దళిత,
బడుగు,బలహీన వర్గాలను, కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించే విదంగా మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి  అని  అన్నారు.శంకర్ నాయక్ పార్టీకి ఆయన చేసిన సేవలు అమోఘం అని  ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీగా  సముచిత స్థానం  కల్పించిందనిఅన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి కి ఎమ్మెల్యే జైవీర్,ఎంపీ రఘువీర్ కు  ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ కృష్ణ నాయక్ ,మాజీ సర్పంచ్,జవహర్లాల్, రమావత్ పరమేష్, ఇస్లావత్ సురేష్ , రమావతి నరేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img