- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బీఆర్ఎస్ కార్యకర కుమారుని వివాహ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలను కాపాడుకోవడం తన కర్తవ్యం అని అన్నారు. కార్యకర్తల ఇండ్లలో పండుగ వాతావరణం శుభకార్యాలు నిర్వహించినప్పుడు కచ్చితంగా పాల్గొనడం తన వంతుగా బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



