Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాహుల్ గాంధీ జన్మదినం..విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

రాహుల్ గాంధీ జన్మదినం..విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  జన్మదినాన్ని పురస్కరించుకుని జుక్కల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొని వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో సహపంక్తి భోజనం, మొక్కల నాటకం, మిఠాయిల పంపిణీతో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జుక్కల్‌లో ఘనంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -