Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుటికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..

టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపు ద్వారా అదనంగా వచ్చే వసూళ్లలో 20 శాతం మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ)కు ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ‘పెద్ది’, ‘రాజాసాబ్’, ‘మనశంకర వరప్రసాద్ గారు’, ‘అఖండ 2’ వంటి చిత్రాలకు ఇది వర్తించనుంది. ఈ సినిమాల టికెట్ ధరల పెంపుతో వచ్చిన కలెక్షన్‌లో 20 శాతాన్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు, టీజీఎఫ్‌డీసీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.

ఈ 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల (థియేటర్ల యజమానులు) నుంచి వసూలు చేసి, సంబంధిత ఖాతాల్లో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల విడుదలైన భారీ చిత్రాలతో పాటు భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో సినీ పరిశ్రమలోని కార్మికుల సంక్షేమానికి ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -