Wednesday, August 19, 2026
E-PAPER
Homeజాతీయండాగ్ స్టెరిలైజేషన్ లో అవినీతి..వినూత్నలో రీతిలో ఫిర్యాదు

డాగ్ స్టెరిలైజేషన్ లో అవినీతి..వినూత్నలో రీతిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కలెక్టరేట్ కార్యాలయంలో కాంగ్రెస్‌నేత దీపక్ “ముల్లు” రాథోడ్, నగరంలో వీధికుక్కల స్టెరిలైజేషన్ (కుక్కల సంతానోత్పత్తి నిరోధక ప్రక్రియ) పథకంలో జరిగిన అవినీతిని నిరసిస్తూ వినూత్న రీతిలో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగించి ప్రజా విచారణ (Public Hearing) సభకు తీసుకువచ్చారు. గత 4 ఏళ్లలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ (కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) కోసం మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు  రూ.40 లక్షల బడ్జెట్ ఖర్చు చేసింది. అయినా జిల్లాలో కుక్కల సంఖ్య తగ్గకపోగా, కుక్క కాటు కేసులు 13,225 కి పైగా పెరిగాయని ఆరోపించారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే దీపక్ రాథోడ్‌కు హామీ ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల కార్యక్రమంలో ఈ విచిత్ర నిరసన  వైరల్‌గా మారింది.ఖాండ్వా మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్‌నేత దీపక్ “ముల్లు” రాథోడ్, నగరంలో వీధికుక్కల సమస్యను మరియు స్టెరిలైజేషన్ (కుక్కల సంతానోత్పత్తి నిరోధక ప్రక్రియ) పథకంలో జరిగిన అవినీతిని నిరసిస్తూ ఒక వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగించి ప్రజా విచారణ (Public Hearing) సభకు తీసుకువచ్చారు.

రాథోడ్ మొదట మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు, కానీ వారు దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. నగరంలో వీధి కుక్కల సమస్యను ఎత్తిచూపేందుకు ఆయన ఈ వినూత్న నిరసన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ ‘కుక్క’కు వంధ్యీకరణ శస్త్రచికిత్స జరిగిందని, అయినప్పటికీ అది ఆరు కుక్కపిల్లలకు తండ్రి అయిందని చెబుతూ, అసలు వంధ్యీకరణ కార్యక్రమం జరిగిందా లేదా అని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంపై విచారణ జరగాలని ఆయన కోరారు. ఒకవేళ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకపోతే, తన పేరుతో అవినీతికి పాల్పడినందుకు మున్సిపల్ కార్పొరేషన్‌పై ఆ ‘కుక్క’ పరువు నష్టం దావా వేస్తుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మొదట ఆశ్యర్యపోయినా, తరువాత ‘కుక్క’ వేషంలో   మనిషి వచ్చాడని తెలుసుకుని  నవ్వుకున్నారు.

కుక్క ముసుగులో ఉన్న వ్యక్తితో కలిసి బహిరంగ విచారణకు వచ్చినపుడు. ప్రవేశద్వారం వద్ద ఉన్న పోలీసు అధికారి మొదట వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, హాలులో ఉన్న అధికారులు వారిని లోపలికి అనుమతించాల్సిందిగా పోలీసులకు సూచించారు. గత 4 ఏళ్లలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ (కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) కోసం మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు  రూ.40 లక్షల బడ్జెట్ ఖర్చు చేసింది. అయినా జిల్లాలో కుక్కల సంఖ్య తగ్గకపోగా, కుక్క కాటు కేసులు 13,225 కి పైగా పెరిగాయని ఆరోపించారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే దీపక్ రాథోడ్‌కు హామీ హామీ వచ్చారు. విచారణ సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి కుర్చీలోనే కూర్చుని ఉండటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -