Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంసార్వత్రిక విద్య పాఠశాల గోడపత్రిక ఆవిష్కరణ

సార్వత్రిక విద్య పాఠశాల గోడపత్రిక ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలోని సార్వత్రిక పాఠశాల ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఆగస్టు నెలాఖరు వరకు అవకాశం ఉన్నట్లు పాఠశాల కోఆర్డినేటర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత తెలిపారు.

బుధవారం స్థానిక ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి పి.ప్రసాదరావు సార్వత్రిక విద్యకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యలో చదువు నిలిపివేసిన వారు తిరిగి విద్యను కొనసాగించేందుకు సార్వత్రిక విద్య మంచి అవకాశమని తెలిపారు. ఇంటర్మీడియట్‌ను ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

ప్రవేశాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సహాయ కోఆర్డినేటర్ సి.హెచ్. నర్సింహారావును సంప్రదించాలని, 9491638599 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -