Wednesday, August 19, 2026
E-PAPER
Homeఆటలుగాలే టెస్టు మ్యాచ్..శ్రీలంకపై భారత్ విక్టరీ

గాలే టెస్టు మ్యాచ్..శ్రీలంకపై భారత్ విక్టరీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 165 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. భారీ విజయాన్ని సాధించడంలో ఆల్-రౌండర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. చివరి రోజున పిచ్ పరిస్థితి క్షీణించినప్పటికీ, విజయానికి అవసరమైన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు చివరకు 206 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 151 బంతుల్లో 59 పరుగులు చేసి దీటుగా పోరాడగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన సోనల్ దినూష ఈసారి 84 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్‌ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు.రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -