- Advertisement -
- నెల రోజుల్లో కోలుకున్న రోగి
– ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ విక్రమ్
నవతెలంగాణ – కామారెడ్డి
స్టేజ్-4లో మోకాలి గుజ్జు పూర్తిగా అరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కామారెడ్డి జిల్లా అడ్లూరు గ్రామానికి చెందిన పెంట గౌడ్‌కు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నెల రోజుల క్రితం రోబోటిక్ టెక్నాలజీతో విజయవంతంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ విక్రమ్ తెలిపారు. కామారెడ్డిలో నిర్వహించిన పత్రికా సమావేశంలో రోగి పెంట గౌడ్‌తో కలిసి డాక్టర్ విక్రమ్ వివరాలు వెల్లడించారు. ఉదయం శస్త్రచికిత్స నిర్వహించి అదే రోజు సాయంత్రం రోగిని నడిపించినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నడకకు అవసరమైన శిక్షణ పూర్తి చేయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం శస్త్రచికిత్స జరిగి నెల రోజులు పూర్తికాగా, పెంట గౌడ్ పూర్తిగా కోలుకుని రోజువారీ పనులను స్వయంగా చేసుకుంటున్నారని డాక్టర్ విక్రమ్ వెల్లడించారు. కామారెడ్డి ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి నెల మూడో బుధవారం కామారెడ్డిలో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇతర రోజుల్లో వైద్య సలహా అవసరమైన వారు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
- Advertisement -



