Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాంగర్గలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

హాంగర్గలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని హంగర్గ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ బుధవారం గ్రామ సర్పంచ్ కుమ్మరి నర్సీంలు కలిసి పరీశీలించారని జీపీ కార్యదర్శి అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు వెంటవెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. వీరికి విడతల వారీగా వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఏవైనా సమస్యలుంటే నేరుగా ఎండీడీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్  నర్సీంలు, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి అశోక్ గౌడ్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -