Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చండేగావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీఓ

చండేగావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని చండేగావ్ జిపి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎంపీఓ రాము గ్రామ సర్పంచ్ బాండేడ్ వార్ లక్ష్మణ్ తో కలిసి పరీశీలించారనీ జీపీ కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ.. గ్రామంలోని కంపోస్ట్ షెడ్, ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలన, నీటినీ పంపింగ్ చేసే మోటారు, గ్రామ పరిశుభ్రత, శానీటేషన్ పనులను పరీశీలించారు. అదేవిధంగా జీపీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పన్నులు వంద శాతం వసూలు చేయాలని కార్యదర్శి వికాస్ రెడ్డికి ఆదేశీంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము,  గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి వికాస్ రెడ్డి, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -