Wednesday, August 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలువీడిన స్కూల్ ప్రిన్సిపల్ హత్య మిస్టరీ

వీడిన స్కూల్ ప్రిన్సిపల్ హత్య మిస్టరీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఈ నెల 11న సాయంత్రం హ‌త్య‌కు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. ఆమెను హ‌త్య చేసింది ఆమె స్కూల్‌లో చ‌దివే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులేన‌ని పోలీసులు ద‌ర్యాప్తులో తేలింది. నిందితులు సీసీ కెమెరాల‌కు చిక్కకుండా, ప‌క్కా ప్లాన్‌తో చేసిన ఈ హత్య కేసును చేధించ‌డం పోలీసులకు స‌వాల్‌గా మారింది. ఆఖ‌రికి ఆమె స్కూల్‌లో చదువుకున్న ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టార‌ని తేలింది.

ఈ నెల 11న సాయంత్రం ప్రిన్సిప‌ల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికి రావ‌డానికి ముందే నిందితులు వెనుక‌వైపు నుంచి గోడ‌దూకి ఇంట్లో చొర‌బ‌డ్డారు.ఆమె ఇంటి తాళంతీసి లోపలికి వెళ్లిన సమయంలో ఆమె వాష్‌రూమ్‌లోకి వెళ్ల‌గానే నిందితులు వంటగదిలోకి వెళ్లి దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అయ్యి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనుక‌ నుంచి వెళ్లి కత్తుల‌తో పొడిచారు. మొత్తం 27 సార్లు ఆమెను విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచారు. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల డబ్బును తీసుకుని పారిపోయారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్లి జల్సాలు చేశారు. చివ‌రికి పోలీసుల‌కు చిక్కారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -