Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఉపాధ్యాయులు క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముక్తేశ్వరిని అభినందించారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జుక్కల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మల్లికార్జున్, జడ్పీసీఈ ఓ చందర్ నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, మండల విద్యాధికారి తిరుపతయ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -