- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఫర్టీలైజర్ షాపుల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమ్మకాలు జరపాలని మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపుల్లో రసాయన ఎరువు మందులను పరిశీలించి, శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఒరిజినల్ రసీదులు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
- Advertisement -



