Wednesday, April 30, 2025
Homeబీజినెస్ఎయిర్‌టెల్‌ చేతికి అదానీ స్పెక్ట్రం

ఎయిర్‌టెల్‌ చేతికి అదానీ స్పెక్ట్రం

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు చెందిన స్పెక్ట్రంను భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ స్వాధీనం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ తన అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌తో కలిసి అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు చెందిన 26గిగాహెడ్జ్‌ బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్‌ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఎయిర్‌టెల్‌ తన 5జి సామర్థ్యాలను, నెట్‌వర్క్‌ కెపాసిటీని పెంచుకోనుంది. నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి ఈ లావాదేవీ పూర్తి కానుందని ఆ సంస్థ పేర్కొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలంలో అదానీ డేటా నెట్‌వర్స్‌ రూ.212 కోట్లతో 400 మెగాహెడ్జ్స్‌ స్పెక్ట్రంను దక్కించుకుంది. గుజరాత్‌, ముంబయి, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, కర్నాటక, తమిళనాడులోని ఈ స్పెక్ట్రంను ఇక ఎయిర్‌టెల్‌ ఉపయోగించుకోనుంది. కాగా ఎంత మొత్తానికి ఈ స్పెక్ట్రం క్రయ, విక్రయం జరిగిందనే విషయాన్ని ఇరు సంస్థలు వెల్లడించకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img