నవతెలంగాణ – హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది గల్లంతైన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసింది. మరో ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు నేడు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్‌లో నిర్వరామంగా వర్క్ చేసిన ఎక్స్‌కవేటర్లు బయటకవు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తి అయినట్లు తెలిసింది. కేవలం డేంజర్ జోన్‌లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే సాంకేతిక కమిటీ సూచనల మేరకు మూడు నెలల పాటు ఈ సహాయక చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌కు 3 నెలల బ్రేక్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES