Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

నవతెలంగాణ – హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉప కులాలకు 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్‌-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్‌-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్‌-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. కాగా ఎస్సీ వర్గీకరణపై నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img