- Advertisement -
– అభినందించిన డీజీపీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి సర్కిల్ కార్యాలయంలో వీధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ జాదవ్ గోవింద్, హెచ్సి 370 కుమారుడు జాదవ్ సాయి చైతన్య (26) గత సంవత్సరము సివిల్స్ లో ఐఎఫ్ఎస్ సర్వీస్ లో ఎంపికయ్యారు. తర్వాత పట్టుదలతో చదివి మంగళవారం ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ పరిక్ష ఫలితలలో అల్ ఇండియాలో 68th ర్యాంక్ సాధించారు. అందులో ఐఏఎస్ కి ఎంపిక కావడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, హెడ్ కానిస్టేబుల్ జాదవ్ గోవింద్ ను, ఐఏఎస్ సాధించిన జాదవ్ సాయి చైతన్యలను అభినందించినట్లు డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపారు.
- Advertisement -