Tuesday, April 29, 2025
Homeజాతీయంఐక్యంగా ముష్కర చర్యలను ఎదుర్కొందాం

ఐక్యంగా ముష్కర చర్యలను ఎదుర్కొందాం

– ఉగ్రదాడి క్షతగాత్రులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ
శ్రీగనర్‌:
భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని, ఈ దాడికి ప్రతిగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా తాము మద్దతిస్తామని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం శ్రీనగర్‌లో పర్యటించిన రాహుల్‌ గాంధీ.. జమ్ముకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో,ఆ రాష్ట్ర సీఎంతో భేటీ అయ్యారు. అనంతరం ఉగ్రదాడి బాధితులను కలిసి మాట్లాడారు. సమాజాన్ని ముక్కలు చేయడం, సోదరుల మధ్య తగాదాలు స ృష్టించడమే ఉగ్రవాదుల పని అని రాహుల్‌గాంధీ అన్నారు. భారతీయులంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కాశ్మీర్‌తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరమని, మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img