నవతెలంగాణ-హైదరాబాద్: పర్యాటకులపై పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ డోగ్రా ఫ్రంట్ కార్మికులు బుధవారం జమ్మూలో నిరసన తెలిపారు. జాతీయ జెండాలను చేతబూని స్థానిక ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మౌనంగా కూర్చోకండి.. “పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. ఈ దారుణ ఘటనపై పాకిస్థాన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ దుర్ఘటన అన్ని వర్గాలను బాధించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ నిరసన ప్రదర్శన ర్యాలీకి పలు స్వచ్చంధ సంఘాలతోపాటు పౌరసంఘాలు సంఘీభావం ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నాయి.
కశ్మీర్‌లో డోగ్రా ఫ్రంట్ కార్మికుల నిరసన
- Advertisement -
RELATED ARTICLES