- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లోని టైర్ నగరంలో నివాసిత భవనాల్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని పౌర రక్షణ శాఖ మీడియాకు వెల్లడించారు. ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపొమ్మని నివాసితులకు ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం ఉదయం ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే దాడులకు పాల్పడడం గమనార్హం. ఈ దాడుల్లో అమాయక ప్రజలు ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, లెబనాన్‌పై జరుపుతున్న దాడులకు ప్రతిగా ఇజ్రాయిల్‌పై ఇరాన్ సోమవారం క్షిపణులతో దాడులకు పాల్పడింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.
- Advertisement -



