- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో పదేళ్లపాటు మురిసిన పల్లె, నేడు కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెడుతోందని కేటీఆర్ విమర్శించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ పనులను గుర్తుచేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. ‘స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. గ్రామాల్లో కనీస వసతుల్లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -