Thursday, May 8, 2025
Homeప్రధాన వార్తలుకాళేశ్వరం ఈఎన్సీ అక్రమాస్తులు

కాళేశ్వరం ఈఎన్సీ అక్రమాస్తులు

- Advertisement -

– రూ.200 కోట్లకు పైనే !
– మార్కెట్‌ విలువ నాలుగు రెట్లకు పైనే
– ఏసీబీ దాడుల్లో హరిరాం
– అవినీతి బాగోతం బట్టబయలు
– ఆయన భార్య అనిత పైనా ఏసీబీ కేసు నమోదు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకున్నదనే ఆరోపణలు, విచారణలు సాగుతున్న తరుణంలో ఇదే ప్రాజెక్టులో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ)గా ఉన్న భూక్య హరిరాం అక్రమాస్తులు రూ.200 కోట్లకు పైనేనని ఏసీబీ అధికారులు నిర్ధారణకు రావటం సంచలనం రేపింది. హరిరాంతో పాటు ఆయన భార్య ఇరిగేషన్‌ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ అయిన అనితపై సైతం ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేయటంతో ఈ ఆరోపణల తీవ్రత మరింత పెరిగింది.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం చీఫ్‌ ఈఎన్సీగా పని చేస్తూ హరిరాం అందినకాడికి డబ్బులను దండుకుంటూ భారీ మొత్తంలో అక్రమాస్తులను పోగేశాడని శనివారం ఆయన ఆస్తులపై జరిపిన ఆకస్మిక దాడుల్లో
ఏసీబీ అధికారులు కనిపెట్టారు. విల్లాలు, వ్యవసాయ భూములు, నగరం నడిబొడ్డులో ఫ్లాట్లు, ఇండ్లు, పొరుగు రాష్ట్రం ఏపీలో సైతం విలువైన వాణిజ్య భూములతో పాటు భారీ మొత్తంలో బ్యాంకులలో కూడబెట్టిన ధనం వివరాలు ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, సంబంధించిన వివరాలతో పాటు పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. అర్ధరాత్రి పొద్దుపోయేంత వరకు సాగిన దాడుల అనంతరం హరిరాంనకు చెందిన ఆస్తుల జాబితా, వాటి విలు వను గణించిన అధికారులకు కండ్లు బైర్లు కమ్మాయి. వాటి విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ నాలుగురెట్ల పైనే ఉంటుందని చెప్పారు. హరిరాం భార్య అనిత సైతం అవినీతికి పాల్పడి ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ అధికారులు కేసును నమోదు చేసి, దర్యాప్తును జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -