Thursday, July 16, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో రైతు మృతి

విద్యుత్ షాక్ తో రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో జాడి రాజమల్లు (46) అనే రైతు మృతి చెందిన సంఘటన మండలం రుద్రారం గ్రామ పరిధిలోని పాత రుద్రారంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం.. రాజయ్య పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉన్న ట్రాన్స్ పార్మర్ జంపర్ వేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లుగా తెలిపారు. అయితే బంపర్ వేయడానికి ముందుగా విద్యుత్ అధికారులు ఏల్సి ఇస్తామని ఇవ్వకపోవడంతోనే విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా నిండుప్రాణం బలిగొన్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ మండల ఇంఛార్జి ఏఇని వివరణ కోరగా.. ట్రాన్స్ ఫార్మర్ ను ఇటీవల విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేశారని, సరఫరాలో ఉన్నందున ప్రమాదవశాత్తు షాక్ వచ్చి ఉంటుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -