ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న సినిమా ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకుడు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు నిర్మాత బెక్కం వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో హీరో రామ్ కార్తీక్, దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి. అలాగే ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్. పాటలు రాస్తాడు, మ్యూజిక్ చేస్తాడు. అతడికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘వి.వి.వినాయక్ ది గోల్డెన్ హ్యాండ్. ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం.
ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని దర్శకుడు వాచస్పతి చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ,‘ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి, ప్రొడ్యూసర్ నరేష్కి ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ మాట్లాడుతూ,‘డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి సినిమా, ఓ మంచి మ్యూజిక్‌తో మీ ముందుకు రాబోతున్నందుకు గర్వంగా ఉంది’ అని తెలిపారు.
థ్రిల్ చేసే ‘మిస్సింగ్ మేఘన’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



