Monday, September 14, 2026
E-PAPER
Homeక్రైమ్వినాయక విగ్రహ ఏర్పాటులో ఘర్షణ.. పూజారి మృతి

వినాయక విగ్రహ ఏర్పాటులో ఘర్షణ.. పూజారి మృతి

- Advertisement -

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలో వినాయక విగ్రహ ఏర్పాటులో భాగంగా ఇరు వర్గాల ఘర్షణలో పూజా కార్యక్రమం చేయడానికి వచ్చిన పూజారి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుమలగిరి సాగర్ మండలంలోని చింతలపాలెంలో వినాయక చవితి సందర్భంగా గ్రామంలో పలుచోట్ల వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ప్రారంభ పూజా కార్యక్రమానికి నాగార్జునసాగర్ కు చెందిన దత్తాత్రేయ శాస్త్రి( దత్తు అయ్యగారు) హాజరయ్యారు. గ్రామంలో మొదట మాది అంటే మా విగ్రహం వద్ద పూజ నిర్వహించాలని ఇరువర్గాల వారు పూజారితో ఘర్షణకు దిగారు.

ఈ తోపులాటలో పూజారి కింద పడగ తల వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన దత్తాత్రేయశాస్త్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పైలాల్ కాలనిలోని అతని నివాసానికి, అనంతరం సాగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తిరుమలగిరి సాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దత్తాత్రేయ శాస్త్రి వినాయక చవితి నాడు మృతి చెందడంతో సాగర్ పైలాన్ కాలనీలో విషాద వాతావరణం చోటుచేసుకుంది. ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నాగార్జునసాగర్ బ్రాహ్మణ సేవా సంఘం వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -