బైంసా డిపో మనేజర్ హరిప్రసాద్..
నవతెలంగాణ-కుభీర్
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాలజ్ క్షేత్రంలో కొలువుదిరిన కర్ర గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సుల సౌకర్యం నిర్మల్ జిల్లా బైంసా ఆర్ టి సి మేనేజర్ హరిప్రసాద్ 11 రోజుల పాటు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలపారు. ఈ సందర్బంగా మేనేజర్ మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సురక్షితంగా ఆలయనికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రములో ని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ హైదరాబాద్, తదితర ప్రాంతలు కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దింతో సోమవారం బైంసా డిపో మేనేజర్ స్వయంగా పాలజ్ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక బాస్ బస్ స్టేషన్ ను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు డిపో మేనేజర్ ను శాలువాతో సత్కరించారు.
పాలజ్ గణేష్ దర్శనానికి ప్రత్యేక బస్సులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



