నవతెలంగాణ-మల్హర్ రావు
వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలో అన్ని గ్రామాల్లోని పురవీధుల్లో, దేవాలయాల్లో, వాడవాడల్లో, ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాలను భక్తిశ్రద్ధలతో సోమవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, యువత, చిన్నారులు గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పలువురు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మండలంలోని అన్ని గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని, జిల్లాలోనే అభివృద్ధిలో మండలం ఆదర్శంగా నిలవాలని గణనాథులకు పూజలు నిర్వహించారు.
ఘనంగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



