Wednesday, August 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘మకుటం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘మకుటం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

- Advertisement -

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ హీరో యిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఈనెల 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా, ఈనెల 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం, పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ నటించిన ఈ సినిమాకి నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా, సమర్పణ : ఆర్‌.బి.చౌదరి, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -