Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

పరకాల జూనియర్ సివిల్ జడ్జి జి. సాయి శరత్
నవతెలంగాణ – పరకాల 

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు చైర్మన్ జి. సాయి శరత్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి. శ్రీవల్లి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి సాయి శరత్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం మనందరి ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి. శ్రీవల్లి శైలజ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి ఆరోగ్యం సాధ్యమవుతుందని, మొక్కలను పెంచడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వివరించారు. పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రకృతి పరిరక్షణ వల్లే మానవాళి మనుగడ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పెద్దబోయిన వేణు, వైస్ ప్రెసిడెంట్ బందెల స్వామి, పి. వెంకటరమణ, జాయింట్ సెక్రెటరీ జి. రాఘవేంద్ర శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్కం శంకర్ (మాజీ ఏజీపీ), ట్రెజరర్ రాహుల్ విక్రం, సీనియర్ ఈసీ మెంబర్ వి. చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్. పవన్ పాల్గొన్నారు. వీరితో పాటు సీనియర్ న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, వంటేరు రాజమౌళి, జి. జగదీశ్వర్, పి. నెహ్రూ నాయక్, ఎం. శ్రావణ్ కుమార్, జి. నరేష్ రెడ్డి, తోట పరమేశ్వర్, మెరుగు శ్రీనివాస్, డి. రమేష్, పవన్, టి. సురేష్, పి. రాజేందర్, చంద్రమోహన్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -