Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
నవతెలంగాణ-అచ్చంపేట
భవిష్యత్తు తరాల మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అడవులను సంరక్షించడం మొక్కలు నాటడం కాలుష్యాన్ని వివరించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాగం కావాలని అమ్రాబాద్ ఎండిఓ రామ్మూర్తి, ఎఫ్ఆర్ఓ సవిత అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నందలూరు గ్రామంలో  అటవీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మరియు మొక్కలు నాటడం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అధికారులు మాట్లాడారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అడవులు, వృక్షాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద సంరక్షణ హరిత తెలంగాణ లక్ష్యాల సాధనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -