Wednesday, August 5, 2026
E-PAPER
Homeఖమ్మం​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల

​విశ్వనాథ ప్రసాద్ రాజుకు నివాళులర్పించిన మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ – సత్తుపల్లి
ములుగు జిల్లా వాజేడులో బుధవారం జరిగిన దివంగత విశ్వనాథ ప్రసాద్ రాజు దశదిన కర్మ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ ప్రసాద్ రాజు చిత్రపటంపై పూలుజల్లి నివాళులర్పించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అనంతరం ప్రసాద్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు, అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన తుమ్మల అభిమానులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -