- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశంపై ఎన్డీయే మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటులో యూసీసీ బిల్లుకు మద్దతు తెలిపినప్పటికీ, బీహార్లో మాత్రం దానిని అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామం బీహార్ ఎన్డీయే కూటమిలో భిన్న స్వరాలను ప్రతిబింబిస్తోంది. జేడీయూ సీనియర్ నేత శ్యామ్ రజక్ మాట్లాడుతూ, “పార్లమెంటులో బిల్లుకు మద్దతు పలికినప్పటికీ, బీహార్లో యూసీసీ అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం. మా పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు” అని తేల్చిచెప్పారు.
- Advertisement -


