- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాగోల్ పరిధి బండ్లగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి వెంటపడిన దుండగులు వేట కొడవళ్లు, కత్తులతో అతడిపై దాడి చేశారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి వెళ్లాడు. అక్కడే ఆ వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. కారులో వచ్చిన దుండగులు హత్య చేసిన తర్వాత పరారయ్యారు. మృతుడు ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ నయీమ్‌గా పోలీసులు గుర్తించారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



