- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల కోసం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి దరఖాస్తు గడువు ఇవాల్టి (సెప్టెంబర్ 15)తో ముగియనుంది. అర్హులైన మహిళలు tgobmms.cgg.gov.in సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 18-55 ఏళ్ల వయసు, గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. తొలి విడతలో నియోజకవర్గానికి 1,000 కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు.
- Advertisement -



