- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వినాయక చవితి వేడుకల్లో భాగంగా బేగంబజార్‌లోని ఫీల్ ఖానా ప్రాంతంలో 24 క్యారెట్ బంగారు పూతతో, 3.8 లక్షలకు పైగా అమెరికన్ వజ్రాలతో అలంకరించిన గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. పంచలోహాలతో తయారు చేసిన ఈ విగ్రహం, ఇత్తడి బేస్‌పై 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెనుకవైపు దశావతారాలు, పైభాగంలో తిరుపతి బాలాజీ డిజైన్లు ఉన్నాయి. సుమారు 48 కేజీల బరువున్న ఈ విగ్రహాన్ని ఎనిమిది మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి రూపొందించారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహానికి బదులు మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.
- Advertisement -



