Wednesday, August 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయండిసెంబర్ లో బంగ్లాదేశ్ కు వెళ్తా

డిసెంబర్ లో బంగ్లాదేశ్ కు వెళ్తా

- Advertisement -
  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

నవతెలంగాణ-హైదరాబాద్: ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. బుధవారం నాడు ఆమె వర్చువల్ పద్ధతిలో చేసిన ప్రసంగించారు. తన రాక అధికారం కోసం కాదని, దేశాన్ని అభివృద్ధి, లౌకికవాదం, శ్రేయస్సు మార్గంలో తిరిగి నడిపించడం కోసమేనని ఆమె పేర్కొన్నారు. ప్రజలు “ఎంతో బాధపడ్డారని”, ఆ పరిస్థితిని ఇక భరించలేక తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నానని హసీనా స్పష్టం చేశారు.

“నాకు తెలుసు, వాళ్లు నన్ను జైల్లో పెట్టొచ్చు లేదా చంపేయొచ్చు, నా వాళ్లతో ఉండటానికి నేను ఇంటికి తిరిగి వెళ్తాను” అని ఆమె దీమా వ్యక్తం చేశారు. “డిసెంబర్ మా విజయానికి సంబంధించిన నెల. అందుకే, ఆ నెలలో తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాల్సి రావచ్చు అని నాకు తెలుసు,” అని ఆమె అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -