- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేటి తెల్లవారుజాము నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీగా ఉన్న హరిరామ్ నివాసంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలకు చేస్తున్నారు. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌లో ఉన్న హరిరామ్ నివాసంలో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తించారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యహరించారు.
- Advertisement -